- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:నిబంధనలు గాలికి..పుట్టగొడుగుల్లా బొగ్గు బట్టీలు
దిశ,ఎర్రగొండపాలెం:అటవీ శాఖ అధికారులు ఆగడాలకు అమాయకులు బలి అవుతున్నారు. అడ్డదిడ్డంగా బొగ్గు బట్టి లకు అనుమతులు ఇస్తున్నారు. పుల్లలచెరువు మండలం ముటుకుల పంచాయతీ పరిధిలో 8 బొగ్గుబట్టీలు ఉన్నాయి. అందులో వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అమాయకులైన చెంచు గిరిజనులను లక్ష్యంగా చేసుకొని బొగ్గుబట్టీల యజమానులు. వ్యాపారాన్ని కొనసాగిస్తారు. పనిచేస్తున్న కార్మికుల సదుపాయాల ఆరోగ్యం పట్ల బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంటారు.బట్టీలకు సమీపంలో నల్లమల్ల అడవి ఉండడంతో సంపద నరికి బొగ్గు బట్టీలకు ఆటోలు ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మొద్దులు కాల్చడం ద్వారా వచ్చిన బొగ్గును బెంగళూరు కలకత్తా ముంబై హైదరాబాద్ ఢిల్లీ వంటి నగరాలకు తరలిస్తుంటారు.
బొగ్గు బట్టీలు గ్రామానికి సమీపంలో ఉండడంతో విషపు వాయువులతో విడుదలైన పొగ ధూళి దుమ్ముతో చిన్నారులు గర్భిణీ స్త్రీలు బాలింతలు ఇలా గ్రామ ప్రజలకు తాగునీరు ఆహార పదార్థాల పై ప్రభావం చూపి అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. అక్రమంగా నిర్వహిస్తున్న కర్ర బొగ్గు పట్టిలను మూసివేసి బట్టీల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు మండల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదు. అటవీశాఖ అధికారులకు నోట్ల కట్టలు తప్ప మా కష్టాలు అర్థం కావు. అవినీతి అటవీ శాఖ అధికారులు ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు. ఎంతమందిని వికలాంగులను చేస్తారు. ఎంతమందిని అనారోగ్యం పాలు చేస్తారు. బట్టీల నిర్వహణ పై సంబంధిత అధికారులపై ముటుకుల గ్రామస్తులు మండిపడుతున్నారు.