నా బిడ్డను చంపిన జిలానీని ఉరితీయాలి.. రషీద్ తల్లి షంషాద్ డిమాండ్

by srinivas |   ( Updated:2024-07-19 14:06:09.0  )
నా బిడ్డను చంపిన జిలానీని ఉరితీయాలి.. రషీద్ తల్లి షంషాద్ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: తన బిడ్డను చంపిన జిలానీని ఉరితీయాలని సీఎం చంద్రబాబుకు రషీద్ తల్లి షంషాద్ విజ్ఞప్తి చేశారు. తన బిడ్డను టార్గెట్ చేసి తన బిడ్డ జిలానీని చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రషీద్ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారని, ఇది రాజకీయ హత్యేనని షంషాద్ ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా దుర్మార్గుడు జిలానీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీలో రషీద్ పని చేస్తున్నాడనే కక్ష్యతోనే జిలానీ చంపేశాడని ఆమె వాపోయారు.

వినుకొండలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై రషీద్‌ను జిలానీ కత్తితో నరికి చంపారు. చేతులు నరికి తలపై దాడి చేసి మరీ చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన రాజకీయ రచ్చకు దారి తీసింది. జిలానీ టీడీపీ కార్యకర్త అని, తమ పార్టీలో పని చేస్తున్నారని రషీద్‌ను చంపేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed