- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుపై ఆరోపణలు.. విజయసాయిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రూ. 15 వేల కోట్ల ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారు. ‘‘పోలవరం జాతీయ ప్రాజెక్టు. నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది. అవినీతి చేసేందుకే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. 2014-19లో చాలా అవినీతి జరిగింది. అవినీతి నుంచి బయటపడేందుకే చంద్రబాబు ఎన్డీఏలో చేరారు. ఎన్డీయేకి, చంద్రబాబుకి క్విడ్ ప్రోకో ఉంది.’’ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రబడ్జెట్‌పై మాట్లాడాలని, పోలవరంలో అవీనితి జరిగి ఉంటే ఆధారాలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయొద్దని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ హెచ్చరించారు.