Breaking: జగన్ హెలికాప్టర్లపై ఎన్నికల కమిషన్ కు రఘు రామ ఫిర్యాదు

by Indraja |
Breaking: జగన్ హెలికాప్టర్లపై ఎన్నికల కమిషన్ కు రఘు రామ ఫిర్యాదు
X

దిశ డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రఘురామ కృష్ణంరాజు భారీ షాక్ ఇచ్చారు. జగన్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 77 క్లాజ్ 1 సుల్ క్లాజ్ ఎ, బి అలానే ఎన్నికల ఖర్చు అభ్యర్ధులు, రాజకీయ పార్టీల ఆధేశాలను స్పష్టంగా నిర్దేశించే ఎన్నికల నియమావళి 1961 ని స్థూల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని తెలియజేస్తూ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత దృష్ట్యా విజయవాడ, విశాఖపట్నం లో హెలీకాఫ్టర్లను ఉనచారని.. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో జగన్ చేయనున్న ప్రచారానికి తన రెండు హెలీకాఫ్టర్లను వాడనున్నారని వాస్తవాన్ని తాను వెలుగులోకి తేవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక హెలికాఫ్టర్ లీజుకు నెలకు రూ/ 3.82 కోట్లు తో పాటుగా, విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ చార్జీలు, స్టార్ హోటల్లో రవాణా పైలెట్లకు వసతి, ఇంధనం, హెలికాఫ్టర్ సిబందికి సంబంధించిన వైద్య ఖర్చులు, ఏటీసీ వంటి వివిధ అనుబంధ ఖర్చులు మొదలైన భారీ భారం అభ్యర్థి వ్యక్తిగత ఖర్చుల కింద నివేదించబడుతుందని పేర్కొన్నారు.

అలానే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నగదు పంపిణికి కావల్సిన నగదును బోర్డింగ్, అలానే ఎలైట్ పాయింట్ల నుండి తరలించడానికి జగన్ హెలీకాఫ్టర్లను ప్రచారానికి ఉపయోగించుకుంటున్నామనే సాకుతో వినియోగించుకునే అవకాశం ఉంది. కనుక ఈ విషయం పై ఎన్నికల సంఘం పరిశీలించాలని.. అలానే ఎన్నికలను ప్రభావితం చేసే ఇలాంటి సందేహాస్పదమైన చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed