Pushpayagam: కన్నుల పండువగా శ్రీవారికి పుష్పయాగం..

by Rani Yarlagadda |
Pushpayagam: కన్నుల పండువగా శ్రీవారికి పుష్పయాగం..
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అర్చకులు పుష్పయాగం నిర్వహించారు. ఈ యాగంలో 8 టన్నుల పువ్వులను వినియోగించారు.15వ శతాబ్దంలో కార్తీకమాసంలో మొదలైన పుష్పయాగం మధ్యలో నిలిచిపోయింది. తిరిగి 1980 నుంచి ఈ యాగాన్ని పునరుద్ధరించింది ఆలయ కమిటీ. పుష్పయాగం నేపథ్యంలో నేడు తిరుమలలో స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. అలాగే.. తోమాల సేవ, అర్చన సేవల్ని కూడా ఏకాంతంగా నిర్వహించారు.

శ్రీవారికి నిర్వహించే పుష్పయాగంలో అనేక రకాల పువ్వులను వినియోగిస్తారు. చామంతి, సంపంగి, పొగడ, జాజి, గులాబీ, గన్నేరు, మల్లెపువ్వులు, కనకాంబరం, మొగలి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం, తామర, కలువ తదితర పువ్వులతో పాటు తులసి, మరువం, దవణం, బిల్వం, కదిరి వంటి పచ్చపత్రాలతో పూజలు నిర్వహిస్తారు. ఈ పువ్వులను ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు అందజేస్తారు. పుష్పయాగానంతరం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి.. దేవేరులతో మలయప్పస్వామిని తిరుమాఢవీధుల్లో ఊరేగిస్తారు.

Advertisement

Next Story