- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంగళగిరిలో ఉద్రిక్తత.. అక్రమ తవ్వకాలను నిలిపివేయాలంటూ ఆందోళన
దిశ, డైనమిక్ బ్యూరో : మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఉండవల్లి కొండ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉండవల్లి కొండవద్ద అక్రమ తవ్వకాలను నిరసిస్తూ మండుటెండను సైతం లెక్క చేయకుండా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం నుంచి కొండ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తవ్వకాలకు సంబంధించిన పర్మిషన్లను చూపించాలని డిమాండ్ చేశారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకులను రెండు వాహనాలలో స్టేషన్‌కు తరలించారు. మహిళలను సైతం బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు పోలీసులు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి కొండ వద్ద అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: రుషికొండకు జగన్ గుండు కొట్టారు.. Nara Lokesh