Land Grabbing: ఒంగోలులో భూ కబ్జా... తీవ్ర ఆవేదనలో బాలినేని

by srinivas |   ( Updated:2023-10-19 13:16:39.0  )
Land Grabbing: ఒంగోలులో భూ కబ్జా... తీవ్ర ఆవేదనలో బాలినేని
X

దిశ, వెబ్ డెస్క్: ఒంగోలులో జరిగిన భూ కబ్జా వ్యవహారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి తీవ్ర ఆవేదన మిగిల్చింది. ఒంగోలులో బాలినేని అనుచరులు భూ కబ్జాకు పాల్పడ్డారు. అయితే ఈ విషయం బాలినేని తెలియదట.. అసలు ఆయన ప్రయమేలేదట. కానీ లోకం మాత్రం ఎమ్మెల్యే బాలినేనినే భూ కబ్జా చేయించారని కోడై కూస్తోంది. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మరో బాధాకరమైన విషయం ఏమింటంటే నిందితులను ఇప్పటివరకూ శిక్షించలేదు. ఇది కూడా ఆయనను మరింత క్షోభలోకి నెట్టింది. దీంతో పోలీసుల తీరును నిరసన వ్యక్తం చేశారు. ఆయనకున్న గన్ మెన్లను ప్రభుత్వానికి సరెండ్ చేశారు.

ఇక ఒంగోలులో జరిగిన భూ కబ్జాను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీస్ ఎస్కార్ట్ లేకుండా హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లారు. అక్కడ సీఎం కార్యాలయంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి ధనుంజయ్ రెడ్డిని కలిశారు. ఒంగోలులో జరిగిన భూ కబ్జా వ్యవహారాన్ని ధనుంజయ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బాలినేని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి క్షోభకు ఎప్పుడూ గురి కాలేదని తెలిపారు. తనకు తెలియకుండా భూ కబ్జా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జా దోషులను పట్టుకోవాలని,. తన అనుచరులు ఉన్నా చర్యలు తీసుకోవాలని ధనుంజయ్ రెడ్డికి తెలిపారు. ఈ కేసులో నిస్ఫాక్షికంగా వ్యవహరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాలని ధనుంజయ్ రెడ్డిని ఎమ్మెల్యే బాలినేని కోరారు.

Advertisement

Next Story

Most Viewed

    null