- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balakrishna Tweet: ఈ గ్రౌండ్‌లోనే 'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్
దిశ, డైనమిక్ బ్యూరో: 'వీర సింహారెడ్డి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేదిక మారిందని అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కొత్త వేదిక అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాటుకు సంబంధించి పనుల ఫొటోలను బాలయ్య షేర్ చేశారు. ఈనెల 6న సాయంత్రం ఈ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరగనుందని బాలయ్య తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
కాగా ఈనెల 6న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సినిమా యూనిట్ తొలత నిర్ణయించింది. అయితే అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటం.. ఇటీవలే జీవో నెంబర్1 విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో నిర్వాహకులు వేదికను ఇన్‌ఫ్రా గ్రౌండ్స్‌కు మార్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్లో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.