Prakasam Barrage: ప్రమాద స్థాయిలో వరద ఉధృతి.. ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేత

by Shiva |   ( Updated:2024-09-02 07:44:02.0  )
Prakasam Barrage: ప్రమాద స్థాయిలో వరద ఉధృతి.. ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎగువ నుంచి వస్తున్న నీటి ఉధృతి కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే డ్యామ్ సమీపంలో ఉండే మూడు బోట్లు వేగంగా వచ్చి డ్యాం గేట్లను బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో డ్యామ్ గేట్ల ప్రాతంలోని ఓ భాగం పాక్షికంగా ధ్వంసమైంది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో వరద ఉధృతిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే డ్యామ్ పైనుంచి వాహనాల రాకపోకలను పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇక బ్యారేజీ నుంచి అధికారులు 11.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతుండగా మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో ప్రస్తుత నీటి మట్టం 24.4 అడుగుల వద్ద కొనసాగుతోంది.

Advertisement

Next Story