- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాశాంతి బెటర్.. జనసేన ఫస్ట్ లిస్ట్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన నిర్ణయాలు ఆ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. పొత్తులో భాగంగా తొలి జాబితాలో 24 సీట్లు పొందినా అందులో కేవలం.. 5గురు అభ్యర్థులను ప్రకటించడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం పట్ల జనసేన కార్యకర్తలు ఒకింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ తొలి జాబితాలో మొత్తం పేర్లు ప్రకటించకపోవడంతో సొంత పార్టీ క్యాడర్ లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. అందులోనూ ప్రకటించిన ఐదుగురి పేర్లలోనూ పవన్ పేరు లేకపోవడంతో కార్యకర్తలను మరింత అయోమయంలోకి నెట్టింది. ప్రత్యర్థులు సిద్ధం అంటే యుద్ధం అని కౌంటర్ ఇచ్చినా ఇలా నిర్ణయాలు సరికాదని కేడర్ ఫైర్ అవుతోంది.
జనసేన అభ్యర్థుల జాబితా, పోటీ చేసే స్థానాలపై ఆ పార్టీ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘మీకన్నా ప్రజాశాంతి బెటర్’ అని ఒక నెటిజన్ అంటే... ‘24 సీట్లా ఎందుకు తెలుగు దేశం పార్టీలో జనసేనను విలీనం చేయండి’ అంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. ‘ఒంటరిగా గెలవలేనప్పుడు ఇంకా పార్టీ పెట్టడం ఎందుకు అన్న పార్టీ పెట్టి 10 ఏళ్లు అయి 24 స్థానాలు ఇవ్వడం ఏంటి.. మన పతనానికి మనమే అవకాశం ఇస్తున్నాం’ అని మరో వ్యక్తి మండిపడ్డాడు. ‘24 స్థానాల్లో పోటీ చేస్తున్నాం.. సీఎం సీటు ఇచ్చేస్తారా సార్’.. పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కాకపోయినా కనీసం స్థానాల పేర్లు ప్రకటించండి.. అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.