ఏపీలో కూటమికి అధికారం.. నటుడు సుమన్ కీలక పిలుపు

by Rajesh |
ఏపీలో కూటమికి అధికారం.. నటుడు సుమన్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీప-జనసేన-బీజేపీ ఘన విజయం సాధించగా నటుడు సుమన్ రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. గతంలో అభివృద్ధిలో ఏపీ పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. చంద్రబాబు విజన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. సినిమా షూటింగ్‌లకు కొత్త విధానం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి ప్రజలు మోడీకి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఏపీని మళ్లీ అమెరికాలా తీర్చిదిద్దాలంటే అది చంద్రబాబు వల్లే అవుతుందన్నారు. హైదరాబాద్ ఆర్కిటెక్చర్ కూడా చంద్రబాబే అని సుమన్ అభివర్ణించారు. నిర్మించే వాళ్లు ఒక్కరే ఉంటారని కానీ విధ్వంసం చేసే వాళ్లు చాలా మంది ఉంటారని అందుకే ఏపీ ప్రజలు చంద్రబాబుకు సహకరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed