- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షర్మిల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన సీపీ కాంతి రాణా
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో షర్మిల కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం తన కాన్వాయ్‌లో ఏపీ కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరగా మార్గమధ్యలో ఎనికేపాడు వద్ద పోలీసులు కాన్వాయ్‌ని మళ్లించారు. దీంతో కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రారాజు, సుంకర పద్మశ్రీ తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అదేవిధంగా తన కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పోలీసులకు ఏం హక్కు ఉందని షర్మిల ప్రశ్నించారు. ఇదే అంశంపై మీడియాలో వచ్చిన వార్తలపై తాజాగా.. సీపీ కాంతి రాణా స్పందించారు. తాము షర్మిల కాన్వాయ్‌ని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కాన్వాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరినప్పుడు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కాసేపు వాహనాలకు నిలిపివేశామని తెలిపారు. విజయవాడ నగరంలోకి అన్ని వాహనాలు ఒకే సారి వస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో కొన్ని వాహనాలను ముందుగా పంపి మరికొన్నింటిని టైం ఇచ్చి వదిలామని తెలిపారు. అందులో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని సీపీ కాంతి రాణా స్పష్టం చేశారు.