AP:‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’..ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

by Jakkula Mamatha |
AP:‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’..ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
X

దిశ,జీలుగుమిల్లి:తుఫాను కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మండలంలోని కాలువలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని, కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, అలాగే విద్యుత్ స్తంభాలను కూడా ఎవరూ ముట్టుకోవద్దని, చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed