CM Chandrababu:గత ప్రభుత్వ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారు!

by Jakkula Mamatha |
CM Chandrababu:గత ప్రభుత్వ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. రేపు(జనవరి 1) న్యూ ఇయర్ కావడంతో ఒకరోజు ముందు నుంచే పింఛన్ల పంపిణీ(Distribution of Pensions) ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో సహా మంత్రులు (Ministers), ఎమ్మెల్యే (MLA's)లు అంతా వారి వారి నియోజకవర్గాల్లో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు(మంగళవారం) పల్నాడు జిల్లా (Palnadu) యల్లమంద (Yellamanda)లో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలన పై విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అంతేకాదు వైసీపీ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారని సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికి తాను వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నదే తన తపన అని చెప్పారు. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ‘నాకు హైకమాండ్ ఎవరూ లేరు. ఐదు కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్’ అని చంద్రబాబు చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు చూడాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed