- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో గంజాయికే మద్దతు ధర..పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లా మండపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర ఉండదని..గంజాయికి మాత్రమే ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని అన్నారు. రాష్ట్రంలోని రైతులు అప్పుల పాలయ్యారు అన్నారు. కానీ గంజాయి పండించే వారు మాత్రం లాభాల్లో ఉన్నారని మండిపడ్డారు.
యువత గంజాయికి బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం చేస్తానన్న సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూటమిని ఆదరించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. యువతకు ఉపాధి అవకాశలు కల్పిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని ఆయన భరోసా ఇచ్చారు.
Read More...
పవన్ కళ్యాణ్‌కు మద్ధతుగా ప్రచారంలో పాల్గొంటా:సీనియర్ హీరోయిన్