‘భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు’.. తిరుమల లడ్డూ వివాదం పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు’.. తిరుమల లడ్డూ వివాదం పై పవన్ కళ్యాణ్  కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం పై చర్చలు జరుగుతున్నాయి. ఈ లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం పై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వినియోగించారని సీఎం చంద్రబాబు(CM Chandrababu) చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ నాణ్యత రుచి పై భక్తులు(Devotees) ఫిర్యాదులు చేశారని పవన్ తెలిపారు. దీంతో నెయ్యి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఈ నేపథ్యంలో యానిమల్ ఫ్యాట్(Animal Fat), ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టులో తేలిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బ తీశారని ఫైరయ్యారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? అని ప్రశ్నించారు. ఈ ఘటనను సహించేది లేదని తెలిపారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు అని డిప్యూటీ సీఎం పవన్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed