- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అప్పుల పాలైపోయిన పవన్ కల్యాణ్.. ఎవరెవరి వద్ద ఎంత తీసుకున్నాడో లిస్ట్ ఇదే..!
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే.. అటూ రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. ఇక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మేల్యే అభ్యర్థిగా ఈ రోజు నామినేష్ వేశారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా పవన్ వెంట వెళ్లారు. అయితే.. పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఆదాయం, ఆస్తుల వివరాలు కూడా అందులో పొందుపరచాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఆయన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇందులో పవన్ కల్యాణ్ ఈ ఐదేళ్లలో రూ. 114 కోట్లు ఆదాయం కూడబెట్టారు. ఇక అప్పుల విషయానికి వస్తే.. ఆయన తీసుకున్న లోన్లతో సహా రూ. 64 కోట్లపైగా అప్పు ఉన్నారు. ఈ అప్పులు ఎవరెవరి వద్ద తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ భార్య కొణిదెల సురేఖ దగ్గర పవన్ రూ. 2 కోట్లు, నిర్మాత నవీన్ యర్నేని, మైత్రి మూవీ మేకర్స్‌కి కలిపి రూ. 8 కోట్లు, హారిక & హాసిని సంస్థకి రూ. 6 కోట్లు, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థకి రూ. 10 లక్షలు అప్పు.. ఇంకా కొందరు వ్యక్తుల వద్ద రూ. 47 కోట్ల వరకు అప్పు చేసినట్లు నామినేషన్‌లో పొందుపరిచారు. వీటితో పాటు.. పవన్ కళ్యాణ్ ట్యాక్సుల రూపంలో రూ. 70 కోట్ల వరకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అప్పుల చిట్టా పద్దు నెట్టింట వైరల్‌గా మారింది.
Read More...
AP News:రాష్ట్రంలో కూటమి విజయం ఖాయం..తేల్చి చెప్పిన జనసేనాని!