- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janasena: అంగన్వాడీలకు పవన్ సంపూర్ణ మద్దతు.. ప్రభుత్వానికి కీలక డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నాలుగు రోజులుగా ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు జనసేన తరపున పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. వెంటనే అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చి... అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఏమనాలని నిలదీశారు. మాట తప్పడం అంటే ఇదేనని, ఈ విషయాన్నే గుర్తు చేసి నిరసన తెలియచేస్తుంటే వేధింపులకు గురి చేయడం పాలకుల నైజాన్ని తెలియచేస్తోందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలుకొట్టి పంచనామాలు చేస్తామని చిరుద్యోగులను బెదిరిస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 52 వేల అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష మందికిపైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామ మాత్రపు వేతనాలకే పని చేస్తున్నారని పవన్ తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి వర్తింప చేయాలని సూచించారు. ఈ చిరుద్యోగుల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలని ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
అంగన్వాడీ కార్యకర్తలు... హెల్పర్ల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలి - Sri @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) December 15, 2023
garu
• ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా?
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలు…