Tarakaratnaకు అస్వస్థత.. స్పందించిన Pawan Kalyan

by sudharani |   ( Updated:2023-02-06 04:08:20.0  )
Tarakaratnaకు అస్వస్థత.. స్పందించిన Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ను షేర్ చేశారు.

''నటుడు నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర అస్వస్థతకు లోను కావడం బాధాకరం. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను'' అంటూ రాసుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story