తమిళ స్టార్ హీరో కార్తీపై పవన్ కల్యాణ్ సీరియస్ (వీడియో)

by Gantepaka Srikanth |
తమిళ స్టార్ హీరో కార్తీపై పవన్ కల్యాణ్ సీరియస్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi)పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సీరియస్ అయ్యారు. సినిమా ఫంక్షన్‌లో లడ్డూపై కార్తీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ మెట్లను శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్లకు పూజ చేశారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘లడ్డూ మీద కొందరు జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఫంక్షన్‌లో లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అంటున్నారు. మళ్లీ ఇంకోసారి అలా అనొద్దు. నటుడిగా మీరంటే నాకు ఎంతో గౌరవం. దయచేసి సనాతన ధర్మాన్ని పాటించండి. ఏదైనా మాట్లాడేముందు వందసార్లు ఆలోచించండి’ అని పవన్ కల్యాణ్ హితవు పలికారు. కాగా, ‘సత్యం సుందరం’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫంక్షన్‌లో లడ్డూ కావాలా నాయనా? అంటూ హీరోను యాంకర్ అడగ్గా.. కార్తీ స్పందించారు. ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు. అది సెన్సిటివ్ టాపిక్ అంటూ నవ్వుతూ తిరస్కరించారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More : ‘లడ్డూ కావాలా నాయనా’ మీమ్ పై కోలీవుడ్ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భూమన నాశనం మొదలైంది: దుర్గమ్మ సన్నిధిలో పవన్ కల్యాణ్ జోస్యం

Next Story

Most Viewed