ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ ఆస్తి పంపకాల టాపిక్.. ఏ భార్యకు ఎంత ఇచ్చాడు?

by Sujitha Rachapalli |
ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ ఆస్తి పంపకాల టాపిక్.. ఏ భార్యకు ఎంత ఇచ్చాడు?
X

దిశ, సినిమా :ఏపీలో పోలింగ్ జరుగుతుంది. ఎవరు, ఎంత మెజార్టీతో గెలుస్తారనే బెట్టింగ్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైందనే అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ సమయంలో మరోసారి జనసేనాని మూడు పెళ్లిళ్ల టాపిక్ తెరమీదకు వచ్చింది. ముగ్గురిని మ్యారేజ్ చేసుకున్న ఆయన.. ఇద్దరికి విడాకులు ఇవ్వగా, వారికి ఎంత భరణం ఇచ్చాడు? పిల్లల చదువు, పెంపకం విషయంలో ఆయన బాధ్యతలు ఎంత వరకు ఉన్నాయి? అనే విషయాలపై డిస్కషన్ జరుగుతుంది. ఈ క్రమంలో ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఇందులో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాడు పవన్.


రేణు దేశాయ్ చాలా అమాయకురాలని చెప్పిన ఆయన.. ఆమె పేరు మీద ఇల్లు రాశానని తెలిపాడు. ఇక అకీరా, ఆద్య చదువు కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశానని వివరించాడు. అయితే తల్లిదండ్రులుగా ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదు.. వాళ్ల ఎదుగుదలకు ఎంత సపోర్ట్ ఇస్తున్నామనేదే ముఖ్యమన్నాడు. తండ్రి తనకు ఏ ఆస్తి ఇవ్వలేదని ధైర్యం మాత్రమే ఇచ్చాడని.. అన్న స్కిల్స్ నేర్చించాడని.. ఈ రెండు కలిపి ఈ రేంజ్‌కు వచ్చానని తెలిపాడు. తన పిల్లలు ప్రస్తుతం ఓ సగటు ఉద్యోగి పిల్లల మాదిరిగానే పెరుగుతున్నారని..వాళ్లు కూడా ఏదో ఒక రోజు గొప్పస్థాయికి ఎదుగుతారని చెప్పుకొచ్చాడు పవన్.

Advertisement

Next Story