- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో దుమారం రేపుతోన్న వృద్ధురాలి మరణం.. స్పందించిన జిల్లా కలెక్టర్..!
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల వివాదం ఏపీ పాలిటిక్స్ ను కుదిపేస్తుంది. పింఛన్ల పంపిణీ విషయంలో ఈసీ వాలంటీర్లను తొలగించడంతో.. వాలంటీర్లందరూ రోడ్డుకెక్కారు. ఇప్పటికే 400 మంది రాజీనామా చేశారు. అయితే నిన్న (ఏప్రిల్ 03) పింఛన్ కోసమని వెళ్లిన వజ్రమ్మ (80) అనే వృద్ధురాలు ఎండకు తట్టుకోలేక వడదెబ్బకు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన కృష్ణా జిల్లా గంగూలురులో చోటుచేసుకుంది. అలాగే తిరుపతి జిల్లా ఎర్ర పారి పాలెం మండలం నెరబైలు సచివాలయం వద్దకు పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధుడు షేక్ అసం కూడా వడదెబ్బ తగిలి మృతి చెందాడు.
వీరి మరణానికి చంద్రబాబే కారణమంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో వైసీపీ-టీడీపీ మధ్య వివాదం నెలకొంది. పల్నాడు జిల్లా కలెక్టర్ ఈ విషయం స్పందించి , పెన్షన్ కోసం వెళ్ళి వృద్ధురాలు చనిపోయిందని వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు.‘వీరి ఆరోగ్యం సరిగా లేని కారణంగా మృతి చెందారని తెలిసింది. ఈ ప్రచారాలను ఆపండి. నిన్ననే ఎంపీడీవోల ద్వారా, పంచాయితీ సెక్రటరీ ద్వారా అందరికీ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి సమాచారం అందించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారికి అందరికి ఇంటి దగ్గరకు వెళ్లి పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి క్లియర్ గా మార్గదర్శకాలు ఇచ్చింది. దాని ప్రకారమే వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది’. అంటూ పల్నాడు జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు.