- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:‘ఇప్పుడు పలావు లేదు.. బిర్యానీ లేదు’..చంద్రబాబు సర్కారుపై జగన్ ధ్వజం
దిశ, డైనమిక్ బ్యూరో:‘జగన్ పలావు పెట్టాడు..చంద్రబాబు బిర్యానీ’ పెడతాడని అంతా నమ్మారని ఎన్నికల హామీలనుద్దేశించి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు పలావు లేదు.. బిర్యానీ లేదన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా , నాయకులైనా అంతేనని అన్నారు. తాను అభ్యర్థిగా ప్రకటించిన బొత్స సత్యనారాయణకు మీరంతా అండగా నిలవాలని వైసీపీ అధినేత జగన్ కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు. అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైయస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంఖ్యా బలం లేకున్నా పోటీ పడుతోందని అన్నారు. తాను ఆ స్థానంలో సీఎంగా ఉండి ఉంటే నైతిక విలువలు పాటించి పోటీ పెట్టబోనని అన్నారు. రాబోయే ఐదేళ్ల పోరాటంలో మీరంతా అండగా నిలవాలని జగన్ కోరారు.