గాజు గ్లాసుకు ఓటు వేయని పవన్ కళ్యాణ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు?

by Sujitha Rachapalli |
గాజు గ్లాసుకు ఓటు వేయని పవన్ కళ్యాణ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. కానీ ఆయన ఓటు మంగళగిరిలోనే ఉంది. పోటీ ఖరారైన తర్వాత ఓటు ఇక్కడి నుంచి పిఠాపురంకు చేంజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ టాస్క్. ఏ నేత అయినా ఒక నియోజకవర్గంలో ఓటు ఉండి.. మరో స్థానం నుంచి పోటీ చేస్తున్నప్పుడు మార్చుకోవడం చాలా సహజం. అయితే పవన్ ఆ పని చేయలేదు. భార్యతో సహా మంగళగిరిలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.


కానీ పొత్తు ప్రాతిపదికన ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుండటంతో ఆయన ఓటు తన సొంత పార్టీ గాజు గ్లాసు గుర్తుకు కాకుండా టీడీపీకి వేయాల్సి వస్తుంది. దీంతో ఒక అధినేత తన ఓటును ఇంత లైట్‌గా తీసుకోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తను కాకపోయినా తన టీమ్ చొరవ తీసుకున్నా సింపుల్‌గా అయిపోయే పని గురించి.. ఎందుకు అంత నెగ్లెక్ట్ చేశారని అంటున్నారు జనాలు. అయితే అభిమానులు మాత్రం ఆయన చేసింది కరెక్ట్ అని.. ఎప్పుడు మంగళగిరిలోనే ఓటు వేసే ఆయన అక్కడే వేశారని చెప్తున్నారు. పిఠాపురంలో ఆయన ఓటు లేకపోయినా గెలుస్తాడనే నమ్మకంతోనే అలా చేశాడని వివరిస్తున్నారు.

Advertisement

Next Story