నందిగం సురేష్ పోలీస్ కస్టడీ పిటిషన్ పై ముగిసిన విచారణ

by Jakkula Mamatha |   ( Updated:2024-09-11 15:23:51.0  )
నందిగం సురేష్ పోలీస్ కస్టడీ పిటిషన్ పై ముగిసిన విచారణ
X

దిశ,మంగళగిరి:బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి రూరల్ పోలీసులు వేసిన పిటిషన్ పై మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. స్పెషల్ పిపి రాజేంద్ర ప్రసాద్ పోలీసుల తరపున వాదించగా, సురేష్ తరఫున హైకోర్టు న్యాయవాది ఇషాంత్ రెడ్డి, బాజీ గంగాధర్‌లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి సురేష్ బాబు తీర్పు ఈనెల 13వ తేదీన వెలువరిస్తామని వాయిదా వేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఈ నెల 5వ తేదీన మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించకపోవడంతో నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి 8 రోజులు ఇవ్వాలని మంగళగిరి కోర్టును రూరల్ పోలీసులు ఆశ్రయించారు.

Advertisement

Next Story