Ap News: ఈ నెల 16న ఏపీలో ఎన్నికలు.. గెలుపెవరిదో..!

by srinivas |
Ap News: ఈ నెల 16న ఏపీలో ఎన్నికలు.. గెలుపెవరిదో..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఈ నెల 16 ఎన్నికల జరగనున్నాయి. విశాఖ జడ్జీ వైస్ ఛైర్మన్ సహా 8 ఎంపీపీ, మరో ఎనిమిది వైఎస్ ఎంపీపీ, మూడు కో ఆప్షన్ సభ్యుల ఖాళీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధిచిన నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 11 లోపు అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో స్వయంగా ఓటు వేసి సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ నెల 16న ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని ఆదేశాలు జారీ చేశారు.

ఎంపీపీ స్థానాలివే..

గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు రూరల్, అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం, సత్యసాయి జిల్లా రామగిరి, అనంతపురం జిల్లా ఉరవకొండ, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు, ఏలూరు జిల్లా ముసునూరు, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

8 వైఎస్ ఎంపీపీ స్థానాలు..

గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా రెంటచింతల, కారంపూడి, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం, అనంతపురం జిల్లా కుందుర్పి, పెదపప్పూరు, కడప జిల్లా లింగాల, చిత్తూరు జిల్లా పెనుమూరు, అనంతపురం, తిరుపతి జిల్లాలు కంబదూరు, డి హీరేహల్ వైఎస్ ఎంపీపీ స్థానాలతోపాటు రేణిగుంట మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యలు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలీసు శాఖ కూడా బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కేంద్రాల వల్ల పటిష్ట భద్రత ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిబంధనలు ఎవరు అతిక్రమించిన ఊరుకునేది లేదని హెచ్చరించారు

Advertisement

Next Story

Most Viewed