సినిమాలు నా ఇంధనం.. రాజకీయంతో ముడిపెట్టొద్దు : Pawan Kalyan

by Seetharam |   ( Updated:2023-08-04 12:14:55.0  )
సినిమాలు నా ఇంధనం.. రాజకీయంతో ముడిపెట్టొద్దు : Pawan Kalyan
X

దిశ, డైనమిక్ బ్యూరో : సినిమాలకు, రాజకీయాలకు వైసీపీ నేతలు ముడిపెట్టడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. సినిమా వేరు రాజకీయం వేరు అని వెల్లడించారు. మంగళగిరిలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. జనసేన పార్టీని నడిపేందుకు.. రాజకీయం చేసేందుకు సినిమాలే తనకు ఇంధనం అని స్పష్టం చేశారు. ఆ ఇంధనాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తన అభిమానులు లేదా ఇతరులు సినిమాలపై చర్చిస్తే పర్వాలేదు కానీ పార్టీ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడితే ఎలా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. మరోవైపు పార్టీ పక్షాన డిబేట్లలో పాల్గొనే వారు వైసీపీ నేతల స్థాయికి దిగజారొద్దు అని సూచించారు. అవతలి వారు ఎక్కువ మాట్లాడితే చెవి తిప్పినట్లు సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ సూచించారు. అంతేగానీ డిబేట్లలో వైసీపీ నేతలు చెప్పినదానికి తల ఊపడం కాదని గట్టిగా ఎదుర్కోవాలని పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు సూచించారు.

Read More..

Janasena: పవన్ కల్యాణ్ సమక్షంలో కీలక నిర్ణయాలు

Advertisement

Next Story