- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీని వీడి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పవన్ కళ్యాణ్ పర్యటనలు, సమీక్షలతో మంచి జోరు మీద ఉన్న విశాఖ జనసేనకు సడన్ బ్రేకులు పడ్డాయి. వార్డు కమిటీలు, బూత్ కమిటీల నియామకం పూర్తి చేసి ఎన్నికలకు సన్నద్ధమవుదామని నియోజకవర్గాల ఇన్చార్జిలు చేస్తున్న ప్రయత్నాలకు కొత్త అధ్యక్షుడు అడుగడుగునా అడ్డు పడుతున్నారు. మిగిలిన పార్టీలు ఎన్నికల కసరత్తులు , వ్యూహాలలో బిజీ బిజీ గా వుంటే జనసైనికులు కొత్త అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ విధించిన చిత్ర విచిత్ర నిబంధనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
పార్టీ కోసమా? కోవర్ట్ ఆపరేషనా?
వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉండగానే ఎమ్మెల్యే టికెట్ ఆశించి జనసేనలో చేరారు. గతంలో రెండు పర్యాయాలు ఆయన విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో 2021లో చిన వాల్తేరు నుంచి కార్పోరేటర్ గా మాత్రమే గెలిచారు. సామాజిక వర్గ కోణంలో, గతంలో ఓటమి చెందారనే సానుభూతితో ఆయనకు వైసీపీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. అయితే ఆ పదవిని కాదనుకుని జనసేనలో చేరారు. ఈయనపై మొదటి నుంచి వైసీపీ కోవర్టు అనే ప్రచారం ఉంది. పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన అనుసరిస్తున్న విధానాలు దానిని బలపరుస్తున్నాయి.
కమిటీల నియామకం లేదు
ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి జనసేనలోకి రావడంతో ఒక్కసారిగా పార్టీకి విశాఖలో జోష్ వచ్చింది. అయితే, కార్యక్రమాలు ఏమీ చేయడకపోవడం, చేయనివ్వకపోవడంతో పార్టీ స్థబ్దుగా ఉండిపోతుంది. ఎన్నికల్లో టికెట్లను ఆశించి పలు నియోజకవర్గాల్లో జనసేన నేతలు పాదయాత్ర తో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, వంశీ వచ్చాక తనకు చెప్పకుండా ఎటువంటి కార్యక్రమం నిర్వహించరాదని హెచ్చరిస్తూ వాట్సప్ గ్రూప్ లో మెసేజ్ లు పెట్టారు. దీంతో ఒక్కసారిగా కార్యక్రమాలు ఆగిపోయాయి.
ఆయన చేయరు.. చేయనివ్వరు
గతంలో పవన్ కళ్యాణ్ , జేడీ లక్ష్మీ నారాయణ వంటి వారు పోటీ చేసిన విశాఖలో వంశీ వైఖరితో జనసేన నిద్రాణావస్థలోకి వెళ్ళిపోయింది. ఎన్నికల తరుణంలో బూత్ కమిటీలు పూర్తి చేయాలనే రాష్ట్ర పార్టీ అదేశాలకు విరుద్ధంగా వంశీ వ్యవహరిస్తుండడంతో నియోజక వర్గ నేతలు కూడా కాదంటే టికెట్ కు ఇబ్బంది అవుతుందేమో అన్న అభిప్రాయంతో మౌనంగా ఉండిపోతున్నారు. పదే పదే ముఖ్యమంత్రి జగన్‌ను, విజయసాయిరెడ్డిని, వైవీ సుబ్బారెడ్డిని జనసేనలోకి వచ్చిన తర్వాత కూడా పొగిడే ఆయన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏయూ వీసీ ప్రసాద రెడ్డిలకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను అధికార వైసీపీ నేతలు దారుణంగా దూషిస్తే అనకాపల్లి జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు విశాఖలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు తప్ప వంశీ నగరంలోనే ఉండి నోరు విప్పలేదు.
అధిష్టానానికి ఫిర్యాదు
విశాఖ నగర జనసేనకు అధ్యక్షుడు లేకుండానే పవన్ వారాహి యాత్ర -3 ఇక్కడ అద్భుతంగా సాగింది. అధ్యక్షుడు లేని సమయంలో నేతలు , కార్యకర్తలు స్వేచ్ఛగా , వినూత్నంగా పలు కార్యక్రమాలు చేశారు. వంశీ అధ్యక్షుడిగా వచ్చాక అన్నీ ఆగిపోవడంతో అధికార వైసీపీ కోవర్ట్ గా వచ్చారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వంశీ బార్ లను అధికార పార్టీ పెద్దలు ప్రత్యేక రక్షణ కల్పించడం, రాజీనామా చేసిన మిగిలిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీల మాదిరిగా వంశీని టార్గెట్ చేయకపోవడం వంటి చర్యలను ఉదహరిస్తూ జనసేన సీనియర్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Read More..