- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే నోటి దురుసు.. తెలంగాణ సీఎం రేవంత్‌పై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తాను సీఎం అయిన తర్వాత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కాల్ కూడా చేయలేదని రేవంత్ రెడ్డి వర్గం, కాంగ్రెస్ నాయకులు చేసిన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సీఎం జగన్ హోహన్ రెడ్డి ట్విట్టర్‌లో విసెష్ తెలిపారని చెప్పారు. ఫోన్ చేసి చెప్పడానికి తాము కాంగ్రెస్ పార్టీలో లేమన్నారు. అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేయాలని, ఎందుకు కలవాలని కొడాలి నాని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని, పట్టించుకునే సమయం జగన్ మోహన్ రెడ్డికి లేదన్నారు. రేవంత్‌రెడ్డిది ప్రాంతీయ పార్టీనా.. ఆయనేమైనా సుప్రీంనా..? అని ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఆయనను కలవనవసరం లేదన్నారు. తెలంగాణలో తమ పార్టీని వద్దనే మూసేశామని నాని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌కు తొంటి ఎముక చికిత్స జరిగింది కాబట్టి ఆయనను సీఎం జగన్ మోహన్‌రెడ్డి వెళ్లి పరామర్శించారన్నారు. రేవంత్ రెడ్డికి అలా ఏమైనా జరిగిందా అని కొడాలి నాని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కావాలంటే డైరెక్ట్‌గా సోనియా గాంధీని, రాహుల్‌ను కలుస్తామని.. అప్పుడు ఆయనే అపాయింట్‌మెంట్ ఇస్తారని నాని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎంజాయ్ చేయమన్నారని.. వాళ్లు తీస్తే ఆ పదవి ఉండదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి వదిలేసి ఏపీలో పోటీ చేస్తామంటే చేయమనండని కొడాలి నాని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిపై ఏపీలో చర్చించడం అనవసరమన్నారు. ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబులా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎదురు చూడరని నాని తెలిపారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతు ఇవ్వలేదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.