‘అర్హతే లేదు’.. జగన్ లేఖకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి

by Satheesh |
‘అర్హతే లేదు’.. జగన్ లేఖకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి లేఖ రాశారు. జగన్ స్పీకర్‌కు రాసిన లేఖపై తాజాగా మంత్రి సంధ్యారాణి స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని అన్నారు. ప్రమాణ స్వీకారం రోజు ఆయన పేరు ఆయనే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సభలో లేరు, స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా ఆయన సభలో లేరని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌కు జగన్ గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. వైసీపీ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారని విమర్శించారు.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో బరిలోకి దిగిన వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలవడంతో అధికారాన్ని కోల్పోయింది. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో పవర్ పోవడంతో పాటు.. సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతి పక్ష హోదా దక్కేందుకు కావాల్సిన ఎమ్మెల్యేలు వైసీపీ గెలవకపోవడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ క్రమంలోనే తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ స్పీకర్‌కు లేఖ రాశారు.

Advertisement

Next Story