RK Roja: ఆ సమాధుల్లోనే పూడ్చేస్తారు... టీడీపీ నాయకులకు రోజా వార్నింగ్

by srinivas |
RK Roja: ఆ సమాధుల్లోనే పూడ్చేస్తారు... టీడీపీ నాయకులకు రోజా వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి భూములను నిరుపేదలకు అందించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. నిరుపేదల జీవితాలు బాగుపడటం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సమాధులతో పోల్చడమేంటి..? అని రోజా ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఆ సమాధుల్లోనే టీడీపీని ప్రజలు పూడ్చేస్తారు అని మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీయే గెలుపొందుతుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. వలంటీర్ల వ్యవస్థను జనం మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థలో సరికొత్త మార్పును తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది అని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా చెప్పారు.

Advertisement

Next Story