- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics: అది చూసైనా వాళ్ళ మనసు కరగదా..? మంత్రి ఆర్కే రోజా
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు ప్రతిపక్ష పార్టీ కారణంగానే పెన్షన్ల పంపిణీ ఆగిపోయిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. మరో వైపు ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకముందే సీఎం జగన్ తాను ఏప్రిల్ 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మీడియాలో అధికారికంగా ఎందుకు ప్రకటించారు అని టీడీపీ ప్రశ్నిస్తోంది.
ఇది ఇలా ఉండగా నిన్న మొన్నటి వరకు పెన్షన్ ను అర్హత కలిగిన వారి ఇంటికి వెళ్లి వాలంటీర్లు పంపిణీ చేసేవారు. అయితే ఎన్నికల కోడ్ అమలు జరిగిన తరువాత, రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల సంఘం ముందస్తు జాగ్రత్తగా వైసీపీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచింది. దీనితో అధికార పార్టీ నేతలు టీడీపీపై విరుచుకు పడుతున్నారు.
టీడీపీ కారణంగా ఎండలో పెన్షన్ కోసం సచివాలయానికి వచ్చి సొమ్మసిల్లి పడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగరి మంత్రి ఆర్కే రోజా ఇదే విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిచారు. పేదలంటే అసహ్యించుకునే అయన తాబేదారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన కుట్రలకు వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. ఎండల్లో పెన్షన్ల కోసం వారు పడుతున్న తిప్పలు చూసైనా చంద్రబాబు అతని అనుచరుల మనసులు కరగవా అని పోస్ట్ లో రాసుకొచ్చారు.
Read More..