ఏపీ జనాభా తగ్గిపోతోంది : మంత్రి పార్థసారథి

by M.Rajitha |
ఏపీ జనాభా తగ్గిపోతోంది : మంత్రి పార్థసారథి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కాబినేట్ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఏపీ జనాభా సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందన్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఏపీలో జనాభా జాతీయ సగటు కంటే తక్కువ నమోదవుతోందని, యువత సంఖ్య కూడా బాగా తగ్గిపోతోందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హత అనే నిబంధన రద్దు బిల్లుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలుపుతున్నామని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పని చేసే యువత జనాభా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని, రాబోయే కాలంలో ఏపీ అధిక వృద్దుల జనాభాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. అందుకే పిల్లల సంఖ్యపై నిషేధాలు ఉండకూడదని కాబినేట్ భావిస్తోందని మంత్రి తెలియజేశారు.

Next Story

Most Viewed