గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ‘బుడమేరు’కు శాపం..మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-11 14:46:06.0  )
గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ‘బుడమేరు’కు శాపం..మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:విజయవాడ వరదలకు(Floods) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగనే కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నేడు(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ..2020లో జగన్ ప్రభుత్వం 198 పనులను రద్దు చేసింది. రద్దు చేసిన వాటిలో బుడమేరుకు(Budameru) సంబంధించిన 5 పనులు ఉన్నాయని తెలిపారు. బుడమేరు డైవర్షన్ చానల్ పనులను చంద్రబాబు(CM Chandrababu) 80 శాతం పూర్తి చేశారని చెప్పారు. బుడమేరు బెజవాడకు దు:ఖదాయిని చంద్రబాబు పనులు ప్రారంభించారు. మిగిలిన పనులను జగన్ పూర్తి చేసి ఉంటే గండ్లు పడేవి కావు అన్నారు.

బుడమేరుకు గండ్లు పడటం వల్లే విజయవాడకు వరదలు(Vijayawada Floods) వచ్చాయని మంత్రి నిమ్మల తెలిపారు. గత ఐదేళ్ల జగన్ పాలన పాపం ఫలితమే ఈ రోజు విజయవాడకు వరదలు వచ్చాయన్నారు. జగన్ చేసిన పాపం ప్రజలకు శాపంగా మారింది అని విమర్శించారు. ఆధునికీకరణ పనులు రద్దు చేసిన వైఎస్ జగన్ బుడమేరు గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి నిమ్మల ఫైరయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు జైల్లో ఉన్న నందిగం సురేష్‌ను కలవడం పై మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. రాష్ట్రం కష్టాల గురించి కానీ, ప్రజల ఇబ్బందుల గురించి కానీ కనీస సమయం కేటాయించేందుకు తీరికలేదని జగన్ పై విమర్శలు గుప్పించారు. జైల్లో ఉన్న ముద్దాయిని కలిసేందుకు రావడమే కాకుండా, జైలు బయటికి వచ్చి బుడమేరు పై అబద్ధాలు వల్లెవేస్తున్నారని జగన్ పై మంత్రి నిమ్మల తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

Advertisement

Next Story