AP Liquor Policy: నేనెవరినీ బలవంతం చేయలేదు : మద్యం టెండర్లపై మంత్రి నారాయణ క్లారిటీ

by Rani Yarlagadda |   ( Updated:2024-10-09 14:46:22.0  )
AP Liquor Policy: నేనెవరినీ బలవంతం చేయలేదు : మద్యం టెండర్లపై మంత్రి నారాయణ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారాయణకు సంబంధించిన ఓ ఆడియో ఇటీవల వైరలైంది. 100 మద్యం షాపులకు తాను టెండర్లు వేస్తున్నట్లు ఆ ఆడియో సారాంశం. 100 మద్యం టెండర్లైనా వేస్తే.. వాటిలో నాలుగైదు షాపులైనా లాటరీలో వస్తాయని, వాటిని టీడీపీ నేతలకు ఇస్తానని ఓ టీడీపీ నేతతో అన్నట్లు ఆ ఫోన్ కాల్ ను వింటే అర్థమవుతోంది. అయితే దీనిపై కొందరు దుష్ర్పచారం చేశారని మంత్రి నారాయణ (Minister Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా అసత్య ప్రచారమని, తనకోసం, పార్టీకోసం కష్టపడిన కార్యకర్తల్ని ఆర్థికంగా ఆదుకోవడం తప్పా అని ప్రశ్నించారు.

మద్యం టెండర్లు (AP Liquor Policy Tenders) వేయవద్దని తానెవరినీ బలవంతం చేయలేదని, వారి తరఫున టెండర్లు వేసి.. లాటరీలో వస్తే వారికే ఇవ్వాలన్న సదుద్దేశంతోనే అలా చెప్పినట్లు వివరణ ఇచ్చారు. కార్యకర్తలతో చేసిన చిట్ చాట్ ను ఎవరో ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేశారని మంత్రి నారాయణ ఫైరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో నేతలు బార్లు, మద్యం వ్యాపారాలను అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అలాంటివి జరగవన్నారు. గడిచిన ఐదేళ్లలో మద్యం వ్యాపారం చేయాలంటేనే భయపడ్డారన్నారు.

Advertisement

Next Story

Most Viewed