AP News:మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై కీలక ప్రకటన చేసిన మంత్రి

by Jakkula Mamatha |   ( Updated:2024-08-01 11:37:00.0  )
AP News:మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై కీలక ప్రకటన చేసిన మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తామన్న హామీని నేరవేరుస్తుంది. ఈ క్రమంలో అన్న క్యాంటీన్, మహిళలకు ఉచిత బస్సు పై మంత్రి బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. త్వరలో అన్న క్యాంటీన్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళలకు త్వరలోనే ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని మంత్రి బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు సరికాదని ఆయన వివరించారు. సామాజిక భద్రత పింఛన్లు ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. నేడు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది అన్నారు.

Advertisement

Next Story