Ap High Court: మంత్రి కొల్లు రవీంద్రకు బిగ్ రిలీఫ్

by srinivas |
Ap High Court: మంత్రి కొల్లు రవీంద్రకు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కొల్లు రవీంద్రకు (Minster Kollu Ravindra) బిగ్ రిలీఫ్ లభించింది. ఈ నెల 20న ఆయన విదేశాలకు (Foreign Trip) వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. పాస్ పార్ట్‌పై (Pass Port) ఉన్న అభ్యంతరాలు తొలగిపోయాయి. ఈ నెల 20న విదేశాలకు వెళ్లేందుకు కొల్లు రవీంద్ర ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆయనపై క్రిమినల్ కేసులు (Criminal Cases) ఉండటంతో పాస్ పోర్టుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో హైకోర్టును (High Court) కొల్లు రవీంద్ర ఆశ్రయించారు. క్రిమినల్ కేసుతో సంబంధం లేకుండా తన పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. రవీంద్ర పాస్ పోర్టును వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story