స్కిల్ స్కామ్‌కు చంద్రబాబే బాధ్యుడు: Minister Bosta

by srinivas |   ( Updated:2023-09-11 11:12:20.0  )
స్కిల్ స్కామ్‌కు చంద్రబాబే బాధ్యుడు: Minister Bosta
X

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ ‌స్కామ్‌కు చంద్రబాబు నాయుడు బాధ్యుడని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు చేసిన అవినీతిని కోర్టులు కూడా ధృవీకరించాయని ఆయన తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. స్కిల్ స్కాం కేసులో రూ.371 కోట్లు అవినీతి జరిగిందని మండిపడ్డారు. రాజధాని వ్యవహారంలోనూ ఇలాంటి అవకతవకలు జరిగాయన్నారు. యుగ పురుషుడిలా చంద్రబాబు తనకు తాను ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తుంటే ప్రజలు సహకరిస్తారా అని మంత్రి బొత్స ప్రశ్నించారు.

Next Story

Most Viewed