- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బానిసగా ఉంటూ చేగువేరా అని ఎలా అంటారు?.. పవన్‌పై నిప్పులు చెరిగిన అంబటి
దిశ, వెబ్‌డెస్క్: బానిసగా ఉంటూ చేగువేరా అని ఎలా అంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ విశాఖ పర్యటనలో సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పవన్‌కు గడ్డం పెరిగినా.. ఫ్లైట్ లేట్ అయినా అందుకు సీఎం జగనే కారణమని అంటాడని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబును గెలిపించేందుకే టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్ పల్లకి పవన్ మోస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ సామాజిక వర్గాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఒకరి పల్లకి మోసే వ్యక్తిని ఆ సామాజికవర్గం గుర్తించదని, మోస పోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు ఏపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. పవన్ సొంత ఊరు, ఇల్లు, ఓటు కూడా లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీకి సపోర్టు చేయడం ఇంతకాన్నా నీచ రాజకీయం ఉండని అంబటి రాంబాబు విమర్శించారు.