విజయవాడకు మీనాక్షి నటరాజన్.. కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరు

by Disha News Desk |
విజయవాడకు మీనాక్షి నటరాజన్.. కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరు
X

దిశ, ఏపీ బ్యూరో : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంస్థాగత ఏపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ఆదివారం విజయవాడకు రానున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ నేతృత్వంలో జరిగే కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారని ఏపీ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి (అడ్మిన్) రవికాంత్ నూతలపాటి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మీనాక్షి నటరాజన్‌తో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నిక అధికారులు స్పెన్సర్ లాల్, హసీనా సయ్యద్ ఈ సమావేశానికి హారవుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు సి.డి.మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యవర్గ సభ్యులు హాజరవుతారని ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed