- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayawada: అమ్మవారి గుడికి శంకుస్థాపన చేసిన విజయవాడ మేయర్
దిశ, ప్రతినిధి విజయవాడ: విజయవాడలోని వైయస్సార్ కాలనీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో గత పది సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటుగా నిత్య పూజలు అలానే ప్రతివారం అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భావించి ఈ ఆలయానికి భక్తులు విరివిగా విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలని గణచారిని కీర్తి భవాని భావించారు.
ఇక ఆలయ అభివృద్ధి నిమిత్తం గణచారిని కీర్తి భవాని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిని అలానే వైయస్సార్ కాలనీ ఎంపీటీసీ కోరగంజి సత్యనారాయణ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగోతి శ్రీనివాసరావు ఎన్ ఎస్ ఆర్ లను ఆహ్వానించారు. కాగా గణచారిని కీర్తి భవాని ఆహ్వానం అందుకున్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేయగా వైయస్సార్ కాలనీ ఎంపీటీసీ కోరగంజి సత్యనారాయణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగోతి శ్రీనివాసరావు ఎన్ ఎస్ ఆర్ లు అతిథులుగా విచ్చేసారు.
అనంతరం వారి చేతుల మీదుగా ఆలయానికి దాతల సహకారంతో చేపట్టిన స్లాబ్ నిమిత్తం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గణాచారిని కీర్తి భవాని మాట్లాడుతూ.. ఈ అమ్మవారి ఆలయానికి అనేక చోట్ల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ఉన్న అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారని పేర్కొన్నారు.
కాగా గొల్లపూడి ఎంపీటీసీ దుర్గారావు, అమ్మవారి పుట్టింటి వారి బంధువులు, విజయవాడ నగరంలో మరికొంతమంది భక్తులు సహకారంతో ఈ గుడికి అభివృద్ధి నిమిత్తం ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. ఇక దీనికి సహకరిస్తున్న వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి దంపతులకి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అమ్మవారి పుట్టింటి వాళ్లు, పైలా కిషోర్, పైల రామ తులసి, నమ్మి దుర్గా సాయి,జానీ, రాజు, లక్ష్మి ఆలయంలో పూజలు చేశారు.