తిరుమల తిరుపతిలో భారీ వర్షం.. ఆ మార్గాలు మూసివేత

by Mahesh |
తిరుమల తిరుపతిలో భారీ వర్షం.. ఆ మార్గాలు మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం(Low pressure) కారణంగా మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజాము నుంచి.. తిరుమల తిరుపతి(Tirumala Tirupati) కొండపై ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో తిరుమల పుర వీధులు జలమయం అయ్యాయి. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా.. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి కూడా వర్షం(Rain) కురవడం.. ప్రస్తుతం కంటిన్యూగా వర్షం పడుతుండటంతో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉందని.. వాహన దారులు అప్రమత్తంగా ఉండి.. జాగ్రత్తగా ప్రయాణించాలని.. తిరుమల కొండపైకి వచ్చిపోయే వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. వర్షం తగ్గిన వెంటనే ఆ రెండు మార్గాలను తెరుస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed