- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. అరాచకపాలనకు చరమగీతం పాడాలని, అభివృద్ధి, సంక్షేమానికి పాటు పడేవారికే తాను మద్దతిస్తున్నానని వెల్లడించారు. ఇలా మద్దతు ప్రకటించినందుకు తనపైనా కులం ముద్ర వేసి తిట్టే వాళ్లు ఉంటారని చెప్పారు. అయినా రాష్ట్ర భవిష్యత్ కోసమే నిజాయితీగా మద్దతు ప్రకటిస్తున్నానని జయప్రకాష్ నారాయణ తెలిపారు.
ఏపీ కంటే ఒడిశా నయమని.. అక్కడ రూ.26 వేల కోట్ల ఆదాయం ఉందని జయ ప్రకాష్ నారాయణ తెలిపారు. అవసరమనుకుంటేనే ప్రభుత్వం అప్పులు చేస్తోందని, ఆర్భాటాలకు పోదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదన్నారు. రాజకీయాలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మద్దతు దారులకు పూలబాటలు వేస్తూ... వ్యతిరేకులకు ముళ్ల బాటలు పరుస్తున్నారని జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.