AP News : విజయవాడ కోర్టుకు తెలుగు రాష్ట్రాల నేతలు

by M.Rajitha |
AP News : విజయవాడ కోర్టుకు తెలుగు రాష్ట్రాల నేతలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ కేసుకు సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాల నేతలు నేడు విజయవాడ(Vijayawada) ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీలో 2007 లో ఓబులాపురం గనుల్లో(Obulapuram Mines) అక్రమ మైనింగ్ పరిశీలనకు అనుమతులు లేకుండా వెళ్లిన 21 మంది తెలుగుదేశం(TDP) పార్టీ నాయకులపై కేసు నమోదైంది. వారిలో ముగ్గురు మరణించగా మిగిలినవారు ఈరోజు తప్పకుండా హాజరవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఇరు రాష్ట్రాల నేతలు విచారణకు హాజరయ్యారు. తమపై తప్పుడు కేసు పెట్టారని, తాము ఎలాంటి తప్పు చేయలేదని నేతలు కోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణను కోర్ట్.. జనవరి 8కి వాయిదా వేసింది. కాగా ఉమ్మడి ఏపీలోని టీడీపీకి చెందిన బలమైన నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప తదితర నేతలు తమ పూర్వపు స్నేహితులతో ఆప్యాయంగా పలకరించుకొని, ముచ్చటించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed