- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool: విశ్వభారతి ఆస్పత్రికి విజయమ్మ.. అవినాశ్‌రెడ్డి తల్లి ఆరోగ్యంపై ఆరా
దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని సీఎం జగన్ అమ్మ వైఎస్ విజయమ్మ పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీలక్ష్మి కర్నూలు విశ్వభారతిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితులను వైఎస్ విజయమ్మ తెలుసుకునేందుకు ఆస్పత్రి వద్దకు వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డిని కలిసి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీలక్ష్మి త్వరగా కోలుకుంటుందని అవినాశ్ రెడ్డికి విజయమ్మ ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ విజయమ్మతో పాటే అవినాశ్ రెడ్డి ఆస్పత్రి బయటకు వెళ్లారు. అనంతరం విజయమ్మను కారు ఎక్కించి పంపించారు.
అయితే ఆస్పత్రి వద్దకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా చేసుకున్నారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదన్న ప్రచారంతో భారీగా మోహరించారు. మరోవైపు తన తల్లి అనారోగ్య కారణాల వల్ల విచారణకు కొంత సమయం ఇవ్వాలని సీబీఐ అధికారులకు అవినాశ్ రెడ్డి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఏం జరుగుతుందోనని అవినాశ్ రెడ్డి అనుచరుల్లో టెన్షన్ నెలకొంది.
Also Read..
Janasena: 609 ఎకరాల భూముల్లో అక్రమాలు.. మంత్రి అమర్నాథ్‌పై తీవ్ర ఆరోపణలు