Silpa Chakrapani Reddy: ఉంటే ఆయనతోనే.. లేదంటే రాజకీయాలు మానేస్తా

by srinivas |   ( Updated:2023-03-08 14:29:35.0  )
Silpa Chakrapani Reddy: ఉంటే ఆయనతోనే.. లేదంటే రాజకీయాలు మానేస్తా
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌తోనే ఉంటానని, లేకపోతే రాజకీయాలు మానేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. వైసీపీ అధిష్టానంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని.. త్వరలో ఆ పార్టీకి శిల్పా చక్రపాణి గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. తాను పార్టీ వీడతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. వైసీపీని వీడటం లేదని, సీఎం జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. వైసీపీపై తాను ఏనాడు కూడా అసంతృప్తిగా లేనని తెలిపారు. సీఎం జగన్ అదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story