- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool: రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
దిశ, కర్నూలు ప్రతినిధి : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య మృతితో తీవ్ర మనస్థాపానికి గురై రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా దూపాడు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుడమిరాల గ్రామానికి చెందిన రంగనాయకులు (28) అదే గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే భార్యా భర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో మృతుడి భార్య లత (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. దాదాపు 1:30 గంటల సమయంలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది.
ఆమె మరణంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త రంగనాయకులు సమీపంలోని దూపాడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకింద మృతి చెందాడు. మృతుడు పట్టాలపై పడుకోవడంతో తల, మొండెం వేర్వేరుగా పడింది. గమనించిన రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతులకు ఏడాది బాబు ఉన్నాడు. క్షణికావేశానికి ఇరువురు మృతి చెందడంతో బాబు అనాథ కాగా ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది.