Ap News: ఆళ్లగడ్డలో బీభత్సం.. ఇదిగో చూడండి!

by srinivas |   ( Updated:2023-03-18 17:14:19.0  )
Ap News: ఆళ్లగడ్డలో బీభత్సం.. ఇదిగో చూడండి!
X

దిశ, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. శిరివెళ్ల మండలం మహాదేవపురం గ్రామంలో పిడుగు పడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చాగలమర్రి మండలంలో వడగండ్ల వానకు పలు పంటలు దెబ్బతిన్నాయి. ఉయ్యాలవాడ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఉరుములు, మెరుపుల శబ్ధానికి 300కుపైగా గొర్రెలు చనిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి (నాని) స్వయంగా వెళ్లి చూశారు. చలించి పోయిన ఆయన అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలి విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డితో కలిసి సీఎం జగన్‌‌ను కలిశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతి బాధితుడికి, ప్రతీ రైతుకు నష్టపరిహారం కచ్చితంగా అందాలనే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గంగుల తెలిపారు.

Advertisement

Next Story