విదేశీ విద్యా పథకం కొందరికేనా!...ఆదోనిలో TNSF నాయకుల ఆందోళన

by srinivas |   ( Updated:2023-02-09 17:40:57.0  )
విదేశీ విద్యా పథకం కొందరికేనా!...ఆదోనిలో TNSF నాయకుల ఆందోళన
X

దిశ, ఆదోని: అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరును తొలగించి జగనన్న విదేశీ విద్యా పథకంగా ప్రభుత్వం మార్చిన విషయం వెలిసిందే. దీంతో ఆదోనిలో TNSF నాయకులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం హయాంలో 4,923 మందికి అందుతున్న విదేశీ విద్యా పథకం కొందరికేనా అంటూ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య, నియోజకవర్గ అధ్యక్షుడు బేస్త జయసూర్య, జిల్లా అధికార ప్రతినిధి బోయ తేజ మాట్లాడుతూ సంపన్న వర్గాలతో సమానంగా బడుగు బలహీనవర్గాలకు కూడా విదేశీ విద్యా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో విదేశీ విద్యా పథకం కింద 4,923 మంది విద్యార్థాలకు రూ. 10 లక్షల చొప్పున రూ. 364 కోట్లు ఆర్థిక సహాయం అందించామన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకానికి కొత్త మార్గదర్శకాలు రూపొందించారని మండిపడ్డారు. టాప్ మొదటి 100 యూనివర్సిటీలో స్థానం సంపాదించుకున్న విద్యార్థులకు పూర్తి స్థాయి పథకాన్ని అమలు చేస్తామని పాదయాత్రలో జగన్ చెప్పినట్లు గుర్తు చేశారు.

ఇప్పుడేమో 101 నుండి 200 యూనివర్సిటీల్లో స్థానం సంపాదించుకున్న విద్యార్థులకు 50 శాతం చెల్లిస్తామని ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 19 కోట్లు ఖర్చు చేస్తూ దానికి రూ. 20 కోట్లతో ప్రకటనలిచ్చారని మండిపడ్డారు. గతంలో మాదిరిగా విదేశీ విద్యా పథకాన్ని ఏ ఆంక్షలు విధించకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని జయసూర్య, బోయ తేజ హెచ్చరించారు.

Advertisement

Next Story