- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు.. ఎలాగో తెలుసా?
దిశ, డైనమిక్ బ్యూరో: తొలకరి పడిందంటే అన్నదాతలు వ్యవసాయ పనులు మొదలుపెడతారు. సాగుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకా చకా చేస్తూ ఉంటారు. ఇది సహజంగా తరచూ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆ ప్రాంతంలో తొలకరి జల్లు పడితే ఇక ఇంట్లో ఎవరూ ఉండరు. అంటే వర్షానికి ఇళ్లు కూలిపోతాయని కాదు..అంతా పొలాల్లోకి పరుగులు తీస్తారు. అరె వ్యవసాయం పండించాలనే పట్టుదల అనుకునేరు కాదు వజ్రాల వేట కోసం. ఇంతకీ పొలాల్లో వజ్రాల వేట అంటే ఇప్పటికే ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది కదూ. దేశవ్యాప్తంగా తొలకరి జల్లుకురిస్తే అన్నదాతలు పంట పండిచే పనిలో బిజీబిజీగా ఉంటే కర్నూలు జిల్లాలో మాత్రం తొలకరి తర్వాత చిన్నాపెద్దా తేడా లేకుండా జనం పొలాల బాట పడతారు. వజ్రాల వేట కోసం ఇంటిల్లపాది పొలాలను జల్లెడ పడతారు. కర్నూలు జిల్లాలో ఇది ప్రతీ ఏడాది జరిగే తంతే.
ముఖ్యంగా వజ్రకరూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాలు తరచూ దొరకుతుండటంతో ఈ ప్రాంతంలోని పొలాలను ప్రజలు జల్లెడపడతారు. అదృష్టవంతులు ఎవరైనా ఉంటే ఒక్క వజ్రంతో ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు. అలా కోటీశ్వరులు అయినవారు లేకపోలేదు సుమీ. ఇటీవలే తొలకరి జల్లు కురియడంతో కర్నూలు జిల్లా మద్దెకర మండలంలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు అన్వేషణ మొదలుపెట్టారు. మండలంలోని బసినేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టగా.. కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చివరకు గుత్తికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని రూ.2 కోట్లకు సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ వార్త తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనం కూడా పొలాల్లో వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు.